శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Chitra
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2015 (16:04 IST)

వంటింటి చిట్కాలు: ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే?

* దోసె పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
 
* వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టుకూడా సులువుగా వస్తుంది.
 
* గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
 
* పచ్చికొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం రుద్దితే తాజాగా ఉంటాయి.
 
* పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
 
* ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే ఆకుకూర సహజ రంగుని కోల్పోదు.