Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం, వేస్తే?

గురువారం, 23 మార్చి 2017 (12:24 IST)

Widgets Magazine

దోసెలు, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలు పోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు వెయ్యాలి. అప్పుడే ఆ వంటలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఎక్కువ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే వెల్లుల్లిపాయ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత పొడిబట్టతో తుడిచేస్తే పొట్టు తీయడం తేలికవుతుంది.
 
పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది. అలాగే కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం, వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది. పాపడ్‌లు, వడియాలు మొదలైనవి వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది. ఇక వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.  
 
బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. గోధుమరవ్వ, మైదా పిండి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. 10. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

బంగాళదుంపలను చిన్నచిన్న ముక్కలుగా కోయకూడదా...?

చాలామంది బంగాళా దుంపలను వండేముందుగా చిన్నచిన్న ముక్కలుగా తరిగేసి వండేస్తుంటారు. ఇలా ...

news

సమ్మర్ స్పెషల్.. పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయాలి..?

పుచ్చకాయను కట్ చేసుకుని.. వాటిలోని విత్తనాలను తొలగించాలి. ఆపై పుచ్చ ముక్కల్ని మిక్సీ ...

హైదరాబాద్ చికెన్ కర్రీ... ఎలా చేయాలో చూద్దాం...

అరకిలో చికెన్ ముక్కలు బాగా కడిగి పెట్టుకోవాలి. అరకిలో టొమేటోలు, 4 ఎండుమిర్చి, 1 ...

news

సమ్మర్ స్పెషల్.. ఫ్యాటీ ఫ్రీ సలాడ్ ఎలా చేయాలి.

అసలే ఎండాకాలం. పోషకాలతో కూడిన సలాడ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ...

Widgets Magazine