గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 నవంబరు 2015 (18:36 IST)

ధనియాలతో ఫుడ్‌పాయిజనింగ్‌కు చెక్..!

ధనియాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి వంటింట్లో ఉండే యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్‌పాయిజనింగ్‌కు కారణమయ్యే విషపూరిత బ్యాక్టీరియాలతో సమర్థవంతంగా పోరాడుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. కేవలం 1.6 శాతం ధనియాల నూనెతో 12 రకాల విషపూరిత బ్యాక్టీరియాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందట. 
 
ఈ నూనె ఎమ్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు సాల్మొనెల్లా, ఈ కొలీలాంటి కణాల బాహ్య చర్మంపై దాడి చేసి, వాటి శ్వాసక్రియ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల ఇది సాధ్యమవుతోందని అధ్యయనకారులు అంటున్నారు. అందుకే ఇపుడు ధనియాలను ఉపయోగించి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టే లోషన్స్ మాత్రలు తయారు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.