శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (15:03 IST)

వర్షాకాలంలో బిస్కెట్లు క్రిస్పీగా ఉండాలంటే?

సాధారణంగా బిస్కట్లతో పాటు అనేక తినుబండరాలు వర్షాకాల్లో మెత్తబడిపోతుంటాయి. ఇలాంటి తినుబండరాలు వర్షాకాలంలో కూడా క్రిస్పీగా ఉంచుకునేందుకు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే యధావిధిగా క్రిస్పీగా ఉంటాయి. ఇందుకోసం పలుకులగా ఉండే ఉప్పు (సాల్ట్ కాదు)ను ఒక తడి వస్త్రంలో కట్టి బిస్కెట్లు దాచిన డబ్బాలో ఉంచినట్టయితే, అవి ఎపుడు కూడా క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ప్రెషర్ కుక్కర్‌లో న్యూస్ పేపర్ ఉంచి రెండు గ్లాసుల నీరు పోసి రాత్రంతా అలానే ఉంచి, మరుసటిరోజు ఉదయాన్నే సబ్బునీటితో శుభ్రం చేస్తే కుక్కర్ మెరుపులీనుతుంది. ఇకపోతే.. గ్లిజరిన్ ముంచిన వస్త్రంతో టేబుల్స్ వంటివి తుడిస్తే కాఫీ, టీ మరకలు తొలగిపోతాయి.