మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (12:37 IST)

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 857 కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వేయి కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 857 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 
 
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 51 వేల 188కు చేరుకుంది. 24 గంటల్లో 1, 504 మంది కోలుకున్నారని దీంతో కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 30 వేల 568కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 239 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 16 వేల 499గా ఉంది.
 
అలాగే.. ఆదిలాబాద్ 09, భద్రాద్రి కొత్తగూడెం 35. జీహెచ్ఎంసీ 250. జగిత్యాల 27. జనగామ 10. జయశంకర్ భూపాలపల్లి 1. జోగులాంబ గద్వాల 2. కామారెడ్డి 01. కరీంనగర్ 48. ఖమ్మం 25. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్‌లో 14 కేసులు నమోదైనాయి. అలాగే నవంబర్ ఏడో తేదీ నాటికి 1,440 కేసులు నమోదు కాగా.. కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.