గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (19:26 IST)

కత్రాలో కరోనా కల్లోలం.. వైష్ణోదేవి విశ్వవిద్యాలయం మూసివేత

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థుల్లో 13మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు విశ్వవిద్యాలయాన్ని మూసివేశాహరు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు యూనివర్శిటీ మూసే ఉంటుందని వారు స్పష్టం చేశారు. 
 
కాగా, డిసెంబరు 31వ తేదీన ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 13 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు తేలింది. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు క్యాంపస్‌ను మూసివేయాలని రియాసీ జిల్లా మేజిస్ట్రేట్ చరణ్ దీప్ సింగ్ యూనివర్శిటీ యాజమాన్యాన్ని అదేశించారు. దీంతో అధికారులు యూనివర్శిటీని మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విద్యా సంస్థ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాలో ఉన్న విషయం తెల్సిందే.