కేరళలో తగ్గని కరోనా ఎఫెక్ట్.. కొత్తగా 5,420 కేసులు

Covid
Covid
సెల్వి| Last Updated: గురువారం, 26 నవంబరు 2020 (18:49 IST)
కేరళలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా కొత్తగా 5,420 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 5,16,978 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దాంతో ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 64,486గా ఉన్నది. కేరళ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

నవంబర్ 15 నుంచి 21 మధ్య నమోదైన కొత్త కేసులు 37,609 కాగా, అంతకుముందు వారంలో (నవంబర్ 8-14) నమోదైన కేసుల కంటే 40,592 తక్కువగా ఉన్నాయని రాష్ట్ర వారపు నివేదిక ద్వారా తెలుస్తోంది.

అలాగే జిల్లాల వారీగా పరిశీలిస్తే... మలప్పురంలో 852, ఎర్నాకుళం 570, త్రిస్సూర్ 556, కోజికోడ్ 541, కొల్లం 462, కొట్టాయం 461, పాలక్కాడ్ 453, అలప్పుజ 390, తిరువనంతపురం 350, కన్నూర్ 264, పతనమిట్టా 197, ఇడుగడ్కాడ్ 103, కేసుకాడి 1032 కేసులు నమోదయ్యాయి.దీనిపై మరింత చదవండి :