మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (20:14 IST)

66 మంది వైద్య విద్యార్థులకు కరోనా 2 డోసులు వేయించుకున్నా పాజిటివ్..

కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ రాష్ట్రంలోని ధర్వాడ్ వైద్య కాలేజీకి చెందిన విద్యార్తుల్లో 66 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. పైగా వీరంతా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కావడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, దక్షిణాది జిల్లాల్లో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా వుంది. ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్ మాత్రం వ్యాపిస్తూనేవుంది. 
 
ఈ క్రమంలో ధర్వాడ్ జిల్లాలోని వైద్య కాలేజీలో 66 మంది వైద్య విద్యార్థులకు ఈ వైరస్ సోకడం గమనార్హం. దీంతో వైద్య కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్థులు బస చేసే హాస్టల్స్‌ను మూసివేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారిని హోం ఐసోలేషన్‌కు పంపారు. అలాగే, కాలేజీ క్యాంపస్‌లో ఉన్న 400 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.