శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:14 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 79 కరోనా కేసులు.. దేశంలో 19 రోజుల్లో 15లక్షల మందికి టీకాలు

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బుటెటిన్‌ విడుదల చేసింది. 28, 254 నమూనాలను పరీక్షించగా 79కేసులు వెలుగులోకొచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8, 88, 178కి చేరింది. 
 
24 గంటల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. అయితే.. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 7,157 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1154 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,32,42,502 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తాజా ప్రకటనలో వెల్లడించింది.
 
భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేవలం 19 రోజుల్లో దాదాపు 45 లక్షల మందికి కొవిడ్‌-19 టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
 
18 రోజుల్లో 40 లక్షల మందికి కొవిడ్‌ టీకా వేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయికి చేరుకున్న దేశంగా భారత్‌ నిలిచింది. పలు ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్‌ విస్తృతంగా సాగేందుకు 65 రోజుల సమయం తీసుకుందని, రోజురోజుకూ వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.