శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:12 IST)

ఆనందయ్య మందుకు అనుమతి లేదు: ఆయుష్ శాఖ

కరోనాను తగ్గించినట్లే ఒమిక్రాన్ వ్యాధిని కూడా తగ్గించగల మందు తన వద్ద వుందని ఆనందయ్య ప్రకటించిన నేపధ్యంలో ఆనందయ్య మందుకు అనుమతి లేదని ఆయుష్ శాఖ తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి మందులు రాష్ట్రంలో పంపిణీ చేయడానికి అనుమతించమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాధి చికిత్సకు అందించే ఏ ఆయుర్వేద మందుకు సంబంధించి ఏ వ్యక్తి తమను సంప్రదించలేదని తెలిపింది.

 
కాగా ఇటీవలే ఆనందయ్య ఓ ప్రకటన చేసారు. ఒమిక్రాన్ పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, 15 రోజులకు ఒకసారి మందులు వాడితే చాలనీ, ఒమిక్రాన్ ఈ చలికాలంలోనే ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 
అంతేకాదు వేరే వ్యాధులు రాకుండా మందులు వెంటవెంటనే వాడాలనీ, త్వరలో క్రిష్ణపట్నం, విశాఖలలో మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఐతే ఈ మందుకు అనుమతి లేదని తాజాగా ఆయుష్ శాఖ తెలిపింది.