ఏపీలో 1,658 మంది ఖైదీలకు కరోనా..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా జనాలతో సంబంధం లేకుండా జైళ్లలో ఉంటే వారికి కూడా కరోనా విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,658 మంది ఖైదీలకు కరోనా సోకింది. వీరిలో ఒకరు మృతి చెందారు.
కడప సెంట్రల్ జైలులో అత్యధికంగా 360 మంది ఖైదీలకు కరోనా సోకింది. వారిలో 349మంది కోలుకున్నారు. ఇక రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 383 మంది, నెల్లూరు సెంట్రల్ జైలులో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా, సబ్ జైళ్లలో కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది రిమాండ్ ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం అన్ని జైలులో 250 యాక్టివ్ కేసులు ఉన్నాయి.