సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (13:04 IST)

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా

nitish kumar
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన వైద్య సలహా మేరకు వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు గత నాలుగు రోజులుగా జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. 
 
గత రెండుమూడు రోజులుగా సీఎం నితీశ్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తూ పర్యవేక్షిస్తుంది.