మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మే 2021 (23:54 IST)

చిన్న పిల్లలకు కరోనా టీకా: ఫైజర్ టీకా

ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇప్పుడు చిన్న పిల్లలకు కరోనా టీకా తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే సెప్టెంబర్‌ నాటికి ఆ టీకా వినియోగానికి అత్యవసర అనుమతులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ టీకాను 2 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్యలోని వారికి వాడే అవకాశం ఉన్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే సిద్ధం చేసిన టీకాను 12 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారి టీకాకు వచ్చే వారం అమెరికా ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు మంజూరయ్యే అవకాశం ఉంది. 
 
ఇక 16 ఏళ్ల నుంచి 85 ఏళ్ల మధ్యలోని వారికి వినియోగించే టీకాకు పూర్తి స్థాయి అనుమతులు ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని ఆంగ్లవార్త పత్రిక న్యూయార్క్‌టైమ్స్‌ పేర్కొంది. గర్భిణుల కోసం అభివృద్ధి చేసిన టీకా సురక్షిత ప్రమాణాలు, క్లీనికల్‌ ప్రయోగాల డేటాను ఆగస్టు మొదటి వారం నాటికి సిద్ధం చేసే అవకాశం ఉంది.