మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: గురువారం, 26 మార్చి 2020 (22:44 IST)

జైలుకు వెళతారా, ఇంట్లోనే ఉంటారా, యువకులకు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాల్సి సమయమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన తరువాత రోడ్లపైకి ఎవరు తిరగకూడదని నిషేదాజ్నలు ఇచ్చాయి. అయినా కొంతమంది మాత్రం పట్టించుకోవడం లేదు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. బాధ్యతగా చాలామంది ఇంటి పట్టునే ఉంటున్నారు. కానీ కొంతమంది యువకులు మాత్రం వాహనాలపై రయ్యుమని తిరుగుతున్నారు. ఖాళీ రోడ్లు ఉన్నాయా కదా అని వారు రెచ్చిపోతున్నారు.
 
యువకులకు ఒకటే చెబుతున్నా..మీరు జాగ్రత్తగా ఉండండి.. రోడ్లపైకి రావద్దండి.. అలా ఎక్కడైనా రోడ్లపై కనిపిస్తే మీకు జైలే గతి. ఎన్నో సెక్షన్లతో మీపై కేసులను పెట్టిస్తాం. మళ్ళీ మీరు బయటకు రాని విధంగా కేసులు ఉంటాయి. ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారా..లేకుంటే జైలు ఊచలు లెక్కిస్తారా మీ ఇష్టమంటూ తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.