ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: సోమవారం, 18 మే 2020 (12:27 IST)

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ

కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,987 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 124 మంది మృతి చెందారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో వైరస్‌ వెలుగుచూసిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసుల నమోదు కావడం ఇదే తొలిసారి.
 
ఇప్పటి వరకు దేశంలో “కరోనా” కేసుల సంఖ్య 90,927కి చేరుకుంది. ఇక వైరస్‌ సోకి 2,872 మంది మరణించారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 38,108 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,946 మంది చికిత్స పొందుతున్నారు అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 
 
మూడో విడత లాక్‌డౌన్‌‌లో సడలింపులు ఇచ్చిన తరువాత “కరోనా” వ్యాప్తి మరింత పెరిగినట్లు వెల్లడయ్యింది. పలు రాష్ట్రాల్లో మొత్తం “కరోనా” కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 
 
మహారాష్ట్రలో ఇప్పటివరకు 30,706 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,135 మంది మరణించారు. గుజరాత్‌లో 10,989 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 625 మంది మరణించారు. తమిళనాడులో 10,585 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 74 మంది చనిపోయారు. ఇక ఢిల్లీలో 9,333 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 129 మంది మృతి చెందారు. 
 
రాజస్థాన్‌లో 4,960 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 126 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 4,790 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ 243 మంది మరణించగా,  ఉత్తరప్రదేశ్‌లో 4,258 పాజిటివ్‌ కేసులు నమోదు అయితే... 104 మంది మృతి చెందారు. వెస్ట్‌బెంగాల్‌లో 2,576 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 232 మంది చనిపోయారు. 
 
పంజాబ్‌లో 1,946 పాజిటివ్‌ కేసులకు గాను, 32 మంది మరణించారు. బీహార్‌లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదు అయితే... ఏడుగురు మృతి చెందారు.  జమ్మూకశ్మీర్‌లో 1,121 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12 మంది చనిపోయారు. కర్ణాటకలో 1,092 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారు.