శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 మార్చి 2020 (17:35 IST)

కరోనా లక్షణాలు ఇలా వుంటాయ్, కరోనా నిరోధించేందుకు ఇలా చేయాలి

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటివరకూ మన దేశంలో 13,93,301 మంది ప్రయాణికులు విదేశాల నుంచి మన దేశానికి రాగా వారిలో 148 మందికి కరోనా వున్నట్లు నిర్థారణ అయ్యింది. వీరిలో 14 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయడం జరిగింది. ముగ్గురు ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. 
 
ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో సినిమా థియేటర్లు, పాఠశాలలు, ప్రధాన ఆలయాలు, ఇంకా జనాభా అధికంగా గుమిగూడే ప్రాంతాలను మూసివేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు సాధారణంగా అనిపించినప్పటికీ అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాలకే ముప్పు వస్తుంది.
కరోనా వైరెస్ లక్షణాలు
కరోనా వైరస్ ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి?
1. ప్రారంభంలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వుంటుంది.
 
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
 
3. న్యుమోనియా, ఆస్త్మా వ్యాధులతో ఇబ్బందిపడేవారికి త్వరగా వ్యాపించే అవకాశం ఎక్కువ.
 
4. వ్యాధి సోకిన వ్యక్తుల వల్ల కానీ, పక్షి, జంతువుల ద్వారా కానీ రావచ్చు.
 
5. కరోనా వైరస్ నియంత్రించేందుకు ఇప్పటివరకూ ఔషధం కనుగొనబడలేదు కాబట్టి ఆ వైరస్ రాకుండా జాగ్రత్త పడాల్సిందే.
వైరస్ సోకకుండా ఏం చేయాలి?
1. సబ్బు నీటితో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి. కనీసం 20 సెకన్ల పాటు మోచేతుల వరకూ రుద్దు కడుక్కోవాలి.
 
2. దగ్గు, తుమ్ముతున్నప్పుడు ముక్కు, నోటిని హ్యాండ్ ఖర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ లేదా టవల్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా వాడిన వాటిని డెట్టాల్‌తో శుభ్రంగా ఉతకాలి. టిష్యూ పేపర్ వాడితే దాన్ని మూత వున్న డస్ట్ బిన్లో వేయాలి.
 
3. బయటకు వెళ్లి వచ్చినప్పుడు కానీ స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లిన తర్వాత కడుక్కోని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకవద్దు.
 
4. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వారు ఉపయోగించే వస్తువులు, దుస్తులు వాడటం చేయకూడదు.
 
5. వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిన ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి, ఎవరైనా జ్వరం లేదా దగ్గు వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.