గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:39 IST)

ఏపీలో కొత్తగా 3వేల కేసులు.. స్పుత్నిక్ వచ్చేస్తోంది..!

ఏపీలో కొత్తగా 3,263 కరోనా కేసులు సోమవారం నమోదు కాగా, వైరస్‌తో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,28, 664 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌తో 7,311 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 8,98,238 మంది రికవరీ అయ్యారు. 23,115 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అలాగే అనంతపురం, కడప, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
 
మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు మూడో టీకాకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. స్పుత్నిక్ టీకాకు ఆమోదం కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో అందుబాటులోకి రానుంది రష్యా వ్యాక్సిన్. దేశంలో టీకా కొరత వేధిస్తోంది. దీంతో స్ఫుత్నిక్‌కు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. 
 
రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన 'స్పుత్నిక్‌-వి' వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 
 
త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే, దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ అవుతుంది.