ఏపీలో విజృంభిస్తున్న కరోనావైరస్, మరో 8555 కేసులు, గొలుసు తెంపే మార్గం ఎలా?

corona virus precautions
ఐవీఆర్| Last Modified ఆదివారం, 2 ఆగస్టు 2020 (20:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని పగడ్బంది చర్యలు తీసుకుంటున్న వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ రోజు అత్యధికంగా విశాఖలో 1227, తూర్పుగోదావరి జిల్లాలో 930 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 8555గా వుంది.

కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,55,869 పాజిటివ్ కేసులకు గాను 79,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,474 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 74,404. ఐతే కరోనావైరస్ గొలుసును తెంపేందుకు ప్రజలు అత్యంత జాగ్రత్తతో వుండాల్సిన అవసరం వుంది. పైన తెలిపిన 8 జాగ్రత్తలు తీసుకుంటే కరోనావైరస్ దాదాపు దరిచేరదు. కరోనావైరస్ పారదోలేందుకు ప్రజలే సైనికులు కావాల్సిన అవసరం వుంది. జాగ్రత్తలు పాటించి కరోనాను పారదోలదాం రండి.దీనిపై మరింత చదవండి :