శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:49 IST)

మండే ఎండలో కరోనా వైరస్ చనిపోతుందా? ఆ ప్రొఫెసర్ ఏమంటున్నారు?

కరోనా వైరస్ ఎండకు చనిపోతుందని చాలా మంది మదిలో ఉన్న భావన. అందుకే ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం పూట కొద్దిసేపు ఎండలో నిలబడాలని సలహా ఇస్తుంటారు. కానీ, ఫ్రాన్స్‌లోని మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రెమీ చారెల్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా బతికి ఉంటుందని చెప్పారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా వ్యాపిస్తుందని అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 92 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ 15 నిమిషాల పాటు బతుకుతుందని తమ పరిశోధనల్లో తేలిందని రెమీ తెలిపారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గంట సేపు దాన్ని పరిశోధించామని... అప్పుడు దాని వైరల్ కౌంట్ మాత్రమే తగ్గిందని, వ్యాప్తి చెందే శక్తి మాత్రం అలాగే ఉందని చెప్పారు.
 
56 నుంచి 60 డిగ్రీల మధ్య కరోనా వైరస్ శక్తి కొంత మాత్రమే తగ్గిందని రెమీ తెలిపారు. వైరస్ లు పరిస్థితులకు తగ్గట్టు మార్పు చెందుతూ ఉంటాయని చెప్పారు. యూరప్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు.
 
కాగా, ప్రపంచం మొత్తం ఉపుడు కరోనా గుప్పెట్లో చిక్కుకుని ఉన్న విషయం తెల్సిందే. ఈ వైరస్ బారినుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.