బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:29 IST)

కరోనా వైరస్ నీటి ద్వారా సంక్రమిస్తుందా?

కరోనా వైరస్ క్రమంగా విజృభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ వ్యాపిస్తోంది. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. కరోనావైరస్ తగ్గిందనుకుంటున్నారు కానీ అది మళ్లీ పెరుగుతోంది.

 
ఈ కరోనా వైరస్ తాగునీరు ద్వారా వస్తుందా అని కొందరికి సందేహాలున్నాయి. ఐతే నీటి ద్వారా COVID-19 వ్యాప్తి చెందదు అంటున్నారు వైద్యులు. ఈత కొలనులో లేదా చెరువులో ఈత కొట్టినట్లయితే ఆ నీటి ద్వారా కరోనా రాదు.

 
కానీ రద్దీగా ఉండే స్విమ్మింగ్ పూల్‌కి వెళితే, ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటే, వారికి కరోనా వుంటే మాత్రం సమస్యే. వారికి వున్న కరోనావైరస్ కచ్చితంగా సోకే అవకాశం ఎక్కువ. కనుక రద్దీగా వుండే ప్రదేశాల్లోకి వెళ్లకపోవడం మంచిది.