శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (11:27 IST)

దేశంలో కొత్తగా 32,080 కేసులు.. 402 మంది మృతి

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం కంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. 
 
ఇందులో గత 24 గంటల్లో 36,635 మంది మహమ్మారి నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారు. కాగా, గత 24 గంటల్లో 402 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,41,360కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
దేశంలో మంగళవారం ఒకేరోజు 10,22,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దీంతో డిసెంబర్‌ 8 వరకు మొత్తం 14,98,36,767 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.