గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (12:56 IST)

దేశంలో కరోనా తగ్గుముఖం.. 9వేలకు దిగువన కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు 9 వేలకు దిగువన నమోదవ్వడం ఊరట కలిగించే అంశం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 11,07,617 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,865 కేసులు బయటపడ్డాయి. 
 
తొమ్మిది నెలల కనిష్ఠానికి కేసుల సంఖ్య చేరింది. తాజాగా 197 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకూ 3,44,56,401 మంది కరోనా బారిన పడగా... ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,852కి చేరింది. 
 
కేరళ రాష్ట్రం నుంచే 4,547 కేసులు..57 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 11,971 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.27 శాతానికి చేరింది. 
 
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,30,793కి తగ్గి.. యాక్టివ్‌ కేసుల రేటు 0.38 శాతానికి పడిపోయింది. సోమవారం ఒక్కరోజే 59,75,469 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,12,97,84,045కి చేరింది.