శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (10:56 IST)

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 511 మంది మృతి.. 91 లక్షల మార్క్ చేరిన కేసులు

దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,059 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,40,312కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,024 మంది కోలుకున్నారు. 
 
గడిచిన 24 గంటల సమయంలో 511 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,33,738 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 85,62,642 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,486 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. కాగా, 40 వేలకు దిగవగా పడిపోయిన రోజువారీ కేసుల సంఖ్య... చలి తీవ్రత పెరుగుతుండడంతో.. మళ్లీ విజృంభిస్తూ వస్తోంది.