బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (13:55 IST)

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. 930 మంది మృతి

కరోనా కేసుల దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి 50వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 43,733 మంది కరోనా బారిన పడ్డారు. 
 
నిన్నటి పోల్చితే 26 శాతం పెరుగుదల. మరో 930 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 3.06 కోట్లకు చేరుకోగా, 4.4 లక్షల మరణాలు సంభవించాయి. 4.59 లక్షల మరణాలు సంభవించాయి. 
 
గత 24 గంటల్లో 47 వేల మందికి పైగా కోలుకున్నారు. మొత్తంగా 2.97 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది. ప్రస్తుతం 4,59,920 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. దేశంలో 36,05,998 మంది టీకా వేయించుకున్నారు.