సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:28 IST)

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..

Covid test
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య గణనీయంగా తగ్గింది. గత రెండు రోజుల క్రితం పది వేల వరకు నమోదైన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1,89,087 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 6,660 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే దేశంలో కరోనా వైరస్ బారినపడిన కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 63,380 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటివరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాతపడ్డారు. వీరితో కలుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,31,369కి చేరింది.