మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (11:07 IST)

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,476 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
 
అలాగే, గత 24 గంటల్లో ఈ వైరస్ బారినపడిన వారిలో 158 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో 9,754 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 59,442 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, ఈ బాధితులంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 4,23,88,475 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ రెండో అల ప్రారంభమయ్యేందుకు ఆరు నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి రెండో వేవ్ ప్రారంభమయ్యేందుకు 4 నుంచి 5 నెలల సమయం పట్టింది. కరోనా థర్డ్ వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని భావిస్తున్నారు. 
 
అయితే, కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు మాత్రం జూన్‌లో నాలుగో దశ కరోనా వేవ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ ఫోర్త్ వేవ్ జూన్‌లో ప్రారంభమై అక్టోబరు వరకు కొనసాగుతుందని పరిశోధకులు వెల్లడించారు.