అక్టోబరులో కరోనా థర్డ్ వేవ్ - నిపుణుల హెచ్చరిక
వచ్చే అక్టోబరు నెలలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఏర్పాటైన నిపుణుల కమిటీ కూడా హెచ్చరిక చేసింది. పైగా, ఇది పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్ఐడిఎం నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
మెరుగైన వైద్య సంసిద్ధత కోసం సన్నద్ధం కావాలని కేంద్రానికి పలు సూచనలు చేసింది ఈ నిపుణుల కమిటీ. అయితే, దేశవ్యాప్తంగా పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు.. సరిపడా వైద్య సౌకర్యాలు లేవని, వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు ,వైద్య పరికరాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవని నివేదికలో పేర్కొంది.