శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (22:52 IST)

కరోనావైరస్ తగ్గినా వదలని అనారోగ్య రుగ్మతలు

కరోనావైరస్ తగ్గినా కొన్ని అనారోగ్య రుగ్మతలు వదలడంలేదని పరిశోధనల్లో తేలింది. ఇటలీలోని మిలన్లోని శాన్ రాఫెల్ ఆసుపత్రి పరిశోధకులు వారు సర్వే చేసిన కోవిడ్ -19 రోగుల సంఖ్య నుండి, గణనీయమైన సంఖ్యలో మానసిక అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారని కనుగొన్నారు. వారి కొత్త అధ్యయనం యొక్క ఫలితాలు మెదడు, మానసిక స్థితి, వ్యాధి నిరోధక శక్తిపై చేసినట్లు పత్రికలో ప్రచురించబడ్డాయి. కరోనావైరస్ నుంచి బయటపడ్డ కొందరిలో మానసిక ఆందోళన, నిరాశ వంటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తేలింది.
 
అధ్యయనం ఏమి కనుగొంది?
కోవిడ్ 19పై కొన్ని ప్రాథమిక అధ్యయనాలు ప్రకారం, రోగులు మతిమరుపు, నిరాశ, ఆందోళన మరియు నిద్రలేమిని అనుభవించారని వారి ప్రాథమిక డేటా సూచించింది. ఈ వ్యాధి నుండి బయటపడిన 402 మంది రోగులతో అధ్యయనకారులు మాట్లాడారు. వారిలో 265 మంది పురుషులు మరియు 137 మంది మహిళలు ఉన్నారు. వీరంతా 18 మరియు 87 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు.
 
COVID-19తో డిశ్చార్జ్ అయిన తర్వాత రోగుల మానసిక అంచనా వేయబడింది. మొత్తంమీద, వారిలో 55.7 శాతం మంది కనీసం ఒక సైకో-పాథలాజికల్ సమస్య వున్నట్లు చెప్పారు. కనీసం 28 శాతం మంది పిటిఎస్‌డితో బాధపడుతున్నారని, 31 శాతం మంది డిప్రెషన్‌తో, 42 శాతం ఆందోళనతో, 20 శాతం అబ్సెసివ్-కంపల్సివ్ (ఓసి) లక్షణాల నుండి, 40 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా సైకో-పాథలాజికల్ సమస్యను ఎదుర్కొంటున్నవారిలో స్త్రీలు ఎక్కువగా వున్నట్లు తేలింది.