గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:11 IST)

కరోనాకేసులు, దక్షిణ కొరియా అలా చేసింది, మరి ఏపీ ఏం చేస్తుందో తెలుసా?

కరోనా బారిన పడిన వ్యక్తులను గుర్తించడానికి దక్షిణ కొరియా అత్యంత ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చే నూతన మరియు తెలివైన  విధానాలను ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడం జరిగింది. సియోల్ సమీపంలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రయాణీకులు ప్రవేశించినపుడు తప్పనిసరిగా వారి శరీర ఉష్ణోగ్రతలు తనిఖీ చేయబడ్డాయి మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క స్వీయ-నిర్ధారణ యాప్‌ని వారు తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

వారి గమ్య స్థానాలకు చేరుకున్న తర్వాత, వారిలో కొత్త కరోనా వైరస్ వల్ల కలిగే వ్యాధి అయిన కోవిడ్ 19 యొక్క ఏదేనా లక్షణాలు తమలో గమనించినపుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేయడానికి స్వీయ-నిర్ధారణ యాప్‌ని ప్రతిరోజూ ఉపయోగించాలి.
 
కోవిడ్ 19 సానుకూలంగా ఉన్న వారి కదలికలు ట్రాక్ చేయబడతాయి. వారు బయట తిరిగేటప్పుడు  సమీపంలో ఉన్న ఇతర వ్యక్తుల యొక్క  ఫోన్లకు వీరి నుండి సామాజిక-దూరం పాటించండి అనే  హెచ్చరిక మెసేజిలు పంపించబడతాయి.
 
యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణ కొరియాలు తమ మొదటి కోవిడ్ 19 కేసును ఒకరోజు తేడాతో  ధృవీకరించాయి, అప్పటి నుండి ప్రస్తుతం వరకు యునైటెడ్ స్టేట్స్ కోవిడ్ కేసులలో ఆరు అంకెల అభివృద్ది నమోదు చేయగా, ఇదే సమయంలో దక్షిణ కొరియా కేవలం 10,000 కేసులు నమోదు చేసి సంక్రమణ వృద్ధిలో మందగమనాన్ని నమోదు చేసింది.
 
దక్షిణ కొరియాలో  కోవిడ్-19 మరణాల రేటు యునైటెడ్ స్టేట్స్ యొక్క మరణాల రేటులో మూడింటి ఒక వంతుగా నమోదు కాబడింది. కోవిడ్ పరీక్షలలో దక్షిణ కొరియా యునైటెడ్ స్టేట్స్ కంటే మూడు రెట్లు ఎక్కువమంది పౌరులకు పరీక్షలు నిర్వహించింది.

ఇదంతా రోజుకు 3,50,000 కంటే ఎక్కువ టెస్ట్ కిట్‌లను ఉత్పత్తి చేసే దక్షిణ కొరియాలో ఉన్న కంపెనీలు చేపట్టిన ఉత్పత్తి వలనే సాధ్యపడింది. అంతేకాకుండా ప్రస్తుత అవసరాలకు మించి వాటి ఉత్పత్తిని ఒక మిలియన్‌కు పెంచాలని ఆ కంపెనీలు యోచిస్తున్నాయి. దక్షిణ కొరియా కోవిడ్ యొక్క వ్యాప్తి గ్రాఫ్ వక్రతగా లేకుండా చదునుగా ఉండడానికి బంగారు ప్రమాణంగా మారిన వాటిలో నిఘా అనేది ఒక చిన్న అంశం మాత్రమే.
 
దక్షిణ కొరియా యొక్క వైరస్ పై ప్రతిస్పందన-త్వరిత చర్య మరియు జాతీయ ఆవిష్కరణల సమ్మేళనంలు కోవిడ్19 వ్యాప్తిని అదుపు చేయుటలో ప్రభావవంతంగా నిరూపించబడ్డాయి. దక్షిణ కొరియాతో పోల్చుకుంటే క్షీణించిన యునైటెడ్ స్టేట్స్ వంటి ఇతర దేశాలకు ఇది పాఠాలు సైతం అందించింది.
 
సమయానుగుణంగా తీసుకున్న చర్యలు:
కాలక్రమంతో వేగంగా ప్రతిస్పందించడం అనేది దక్షిణ కొరియా చేపట్టిన సమర్థవంతమైన నియంత్రణలో ఒకటిగా చెప్పవచ్చు. ఆ  దేశం వైరస్ పట్ల తీసుకునే చర్యలకు గాను తక్కువ సమయం వృధా చేసింది. జనవరి 20న దక్షిణ కొరియా తన మొదటి కోవిడ్-19 కేసును గుర్తించిన ఒక వారం లోపు, ఆరోగ్య అధికారులు 20 వైద్య మరియు ఔషధ సంస్థలతో సమావేశమై టెస్ట్ కిట్ల ఉత్పత్తికి ఆమోదం తెలిపి ఉత్పత్తి  ప్రారంభించడం చేశారు. 
 
మొదట కొంత సంకోచించిన దక్షిణ కొరియా ప్రభుత్వం ఫిబ్రవరి 23న దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దక్షిణ కొరియాలో ఈ వ్యాధి కనుగొన్న తరువాత నివారణ చర్యలు అమలు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. మొదటి కోవిడ్ కేసు కనుగొన్న తర్వాత కేవలం తొమ్మిది రోజులలో జనవరి చివరిలో కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (కెసిడిసి) మరియు నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేయడానికి మరియు కోవిడ్ కేసుల సమాచారం సేకరించడానికి “1339” అనే నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 
 
అదే సమయంలో, కొరియా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఏజెన్సీ 700,000 కంటే ఎక్కువ ఫేస్‌ మాస్క్‌లను ప్రమాదం సంభవించే ప్రదేశాలకు, కార్యాలయాలకు సరఫరా చేసింది. మొదటి కేసు ధృవీకరించబడిన సుమారు రెండు వారాల తరువాత, కోవిడ్ పరీక్ష నిర్వహించిన తరువాత ఆరు గంటల్లో ఫలితాలను ఇవ్వగల టెస్ట్ కిట్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టి పంపిణీ చేసి వీటి ద్వారా  దక్షిణ కొరియా రోజూ సుమారు 20,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించడం జరిగింది.
 
కార్యనిర్వాహక పనులు త్వరగా అమలు చేయుటలో ప్రోత్సాహం..
2015లో సంభవించిన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వ్యాప్తి సమయంలో దక్షిణ కొరియా నేర్చుకున్న పాఠాలు ఈ త్వరిత  ప్రతిస్పందనకు కారణమని చెప్పవచ్చు.
 
ఎందుకంటే ఆ అంటువ్యాధి సమయంలో దక్షిణ కొరియా ప్రభుత్వం వ్యాధి పట్ల ప్రతిస్పందన నెమ్మదిగానూ మరియు సరిపోలేని విధముగా ఉండడం వలన సౌదీ అరేబియా కంటే అత్యధిక సంఖ్యలో కేసులను ఎదుర్కోవడం జరిగింది. ఆ సందర్భం లో వ్యాధి పట్ల ప్రజలకు సరైన సమాచారం లేదు, మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పరీక్షలు నిర్వహించుటకు సరైన వస్తు సామగ్రి లేదు. 
 
వైరస్ బారిన పడినవారు పరీక్షలు నిమిత్తం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి  తరలించబడ్డారు. రాబోయే కాలంలో ఇలాంటి సందర్భం ఏర్పడినపుడు ఆ లోపాలు ఇబ్బందులు తిరిగి ఏర్పడకుండా ఉండటానికి దక్షిణ కొరియా ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను సృష్టించింది. తద్వారా తదుపరి కాలంలో ఏదేనా మహమ్మారి ఏర్పడినపుడు దానికి ఎదుర్కొనడానికి తగిన శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఆరోగ్య సంక్షోభం సంభవించినప్పుడు పరీక్షా వ్యవస్థలను వెంటనే ఆమోదించడానికి ఒక చట్టాన్ని సైతం ఆమోదించింది.
 
ప్రస్తుత  కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో పరీక్షా వస్తు సామగ్రిని త్వరగా ఉత్పత్తి చేయడానికి ఈ  చట్టం మరియు విధానాలు అనుకూలించాయి.
 
వినూత్న ఆవిష్కరణల గల దేశంగా..
ఈ నూతన అంటువ్యాధిని అదుపు చేయుటకు దక్షిణ కొరియా చేపట్టిన నిర్మాణాత్మక ప్రతిస్పందన మరియు వినూత్న ఆవిష్కరణలకు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. అనారోగ్యంతో ఉన్నవారిని భౌగోళికముగా గుర్తించడానికి మరియు వారి నుండి ఇతరులు సురక్షితముగా ఉండడానికి  మరియు వారిని  ప్రభుత్వ లేదా ఆరోగ్య సిబ్బందికి అనుసంధానించడానికి దక్షిణ కొరియా అత్యున్నత సాంకేతికపరమైన యాప్‌లు ఉపయోగించడం మరియు ముఖాలను స్కానింగ్ చేసి మనుషులను గుర్తుపట్టే సాంకేతిక పరిజ్ఞానము గల సిసి టివిలను బహిరంగ కూడళ్ళు ప్రదేశాల్లో ఉపయోగించడంపై చాలా శ్రద్ధ పెట్టబడింది.
 
దక్షిణ కొరియా తీసుకున్న జాగ్రత్తలతో కనిపెట్టబడిన అత్యంత విలువైన ఆవిష్కరణలతో వైరస్ వ్యాప్తి మందగించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడబడ్డాయి. దక్షిణ కొరియా యొక్క మొట్టమొదటి సానుకూల కేసు గుర్తించిన  ఒక నెల తరువాత, ఆ దేశ  ఆరోగ్య అధికారులు డ్రైవ్-త్రూ టెస్టింగ్ అనే ఒక సులువైన ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. 
 
ఈ విధానంలో వేల సంఖ్యల్లో రోగులు తమ వాహనం దిగకుండా  సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ సురక్షితంగా తమ వాహనాల్లోనే ఉండి తమ వంతు  పరీక్ష కోసం ఎదురుచూస్తూ పరీక్షించబడేలా  ఏర్పాట్లు చేయబడ్డాయి. దీనికి సంబందించి మొట్టమొదటి టెస్టు త్రూ డ్రైవ్ అనేది ఫిబ్రవరి 23న ఒక విశ్వవిద్యాలయం యొక్క పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి టెస్టు త్రూ డ్రైవ్ అనేవి 70కి పైగా మరియు 600 కి పైగా పరీక్షా కేంద్ర సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి.
 
మరొక సరళమైన ఆచరణాత్మకమైన ఆలోచన ప్రభుత్వం సామాన్య  రోగులను మరియు కోవిడ్ రోగులకు చికిత్స సౌకర్యాలు వేరువేరుగా ప్రత్యేకంగా నిర్వహించడానికి కొన్ని వైద్య సదుపాయాలను కేటాయించి ఒక ప్రత్యేక నిర్దేశిత ప్రాంతంలో వ్యవస్థని ఏర్పాటుచేసి ప్రభుత్వ సమాచార యాప్‌లలో చేర్చబడి ప్రజలు వాటిని బాగా గుర్తించేలా పెద్దపెద్ద సంకేతాలు వాటి ప్రాంగణములో ఏర్పాటు చేశారు.
 
ఆసుపత్రి ప్రవేశద్వారం వద్ద సూట్లు ధరించిన వ్యక్తులు వాక్-ఇన్ ద్వారా వచ్చే రోగుల యొక్క అనారోగ్యం గురించి ఆరా తీసి వారిని వారి అనారోగ్యానికి  సంబంధించిన విభాగానికి పంపించే విధంగా ఏర్పాట్లు చేసి సామాన్య రోగులు మరియు కోవిడ్ రోగులు కలపకుండా ఏర్పాట్లు చేసి జాగ్రత్తపడడం జరిగింది. ఈ విధానం వలన కోవిడ్ వ్యక్తుల నుండి ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా నివారించడం సులువు అయినది. 
 
రాజకీయ కార్యక్రమాలు అన్ని దేశం కోసమే..
కోవిడ్-19 పై దక్షిణ కొరియా యొక్క ప్రభుత్వ సమన్వయం లేనపుడు ప్రతిస్పందన చాలా తక్కువ వేగాన్ని కలిగి ఉండేది. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలను ఒకచోట చేర్చింది. అంటువ్యాధి ప్రాంతాలను పరిష్కరించడానికి స్థానిక అధికారులపై  విడిచిపెట్టకుండా, వ్యాప్తి విషయములో జాతీయ స్థాయిలో ప్రతిస్పందించింది.

జాతీయ అధికారులు మహమ్మారి వలన ఏర్పడిన ఆర్థిక పతనం నుండి దేశం కోలుకోవడానికి నగరాలు మరియు ప్రావిన్సులకు సహాయ ప్యాకేజీలను ప్రకటించడం, సామాజిక భద్రతా చెల్లింపులను నిలిపివేయడం మరియు మధ్యస్థ ఆదాయ స్థాయి కంటే తక్కువ ఉన్న గృహాలకు నగదు చెల్లింపులను అందించడం వంటి చర్యల ద్వారా సిద్దమయ్యారు.
 
ఫేస్‌ మాస్క్‌ల‌కు మించిన  జాతీయ సమన్వయ ప్రభావం ఎక్కడా స్పష్టంగా కనపడ లేదు. దక్షిణ కొరియా కూడా యునైటెడ్ స్టేట్స్ మాదిరిగానే మాస్కుల  కొరతను ఎదుర్కొంది, దక్షిణ కొరియా లో  కూడా మాస్కుల కొరత, రద్దీ మరియు ధరల పెరుగుదలకు దారితీసింది. మార్చి 5న ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసిన 80 శాతం మాస్కులను కొనుగోలు చేసి ఆసుపత్రులలో పంపిణీ కోసం ప్రాధాన్యత ఇచ్చింది.

అంతేకాకుండా మాస్కుల యొక్క ధర నియంత్రణ మరియు రేషన్ వ్యవస్థను సృష్టించింది. రద్దీని నివారించడానికి, పౌరులు వారి పుట్టిన సంవత్సరాల చివరి అంకెల ఆధారంగా సూచించబడిన రోజులలో మాత్రమే మాస్కులు కొనుగోలు చేయడానికి ప్రజలు అనుమతించబడ్డారు.
 
మాస్కుల పంపిణీ మరియు సరఫరాతో పాటు వీటిని ఫార్మసీ, పోస్టాఫీసు లేదా వ్యవసాయ సహకార సంఘంలో మాత్రమే కొనుగోలు చేసే విధంగా అమ్మకాలపై  ప్రభుత్వ నియంత్రణ కారణంగా దక్షిణ కొరియాలో ఒక మాస్కు సుమారు $1.27 లభించడం జరిగింది. ఈ విధానం వలన అవసరమైన వైద్య సామాగ్రి మరియు విస్తృత సరఫరా కోసం మేయర్లు మరియు గవర్నర్లు ఒకరినొకరు పోటీపడవలసిన పరిస్థితులు నివారించబడ్డాయి.
 
ప్రభావవంతమైన పరీక్ష మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభ వ్యాప్తిలో కలిగి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ యొక్క భాగాలు కోలుకోవడానికి మరియు సురక్షితంగా తిరిగి తెరవడానికి విస్తృతమైన పరీక్షలు, సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు నిరంతర సామాజిక దూరం పాటించడం అనేది  ఖచ్చితంగా అవసరం. దక్షిణ కొరియా ఫోన్ యాప్ అనేది సాధ్యావంతమైన పరిష్కారం కాదని భావించవచ్చు. ఇది చాలామందికి  తెలిసిన సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి పనిచేస్తుంది. 
 
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే...
వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచుటకు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియా చర్యలు గరిష్టానికి మించి ఇంకా ఎక్కువ చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో కోవిడ్ నిర్వహణలో దక్షిణ కొరియా కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించినదని భావించవచ్చు.  
 
దేశంలో విధించబడిన లాక్ డౌన్ మరియు రాష్ట్రంలో వైరస్ నివారణకు మరియు లాక్ డౌన్ వలన ప్రజలకు  ఏర్పడే ఇబ్బందులు మరియు ఇతర చర్యలు సక్రమంగా అమలుకు గాను దీన్ని  ప్రతిష్టాత్మకముగా తీసుకున్న ప్రభుత్వం అనేక విభాగాలకు సంబందించి నిర్వహణ పర్యవేక్షణ  గాను ఒక అత్యున్నత స్థాయి సీనియర్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.  
 
ఈ బృందం విమాన ప్రయాణికులను మొదలుకుని వలస కూలీల వరకూ ఎంతో శ్రద్దగా నిర్వహించడం జరిగినది. రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలు ఓడరేవుల ద్వారా ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరి ప్రయాణికుడిని గుర్తించి వారికి పరీక్షలు చేసి నిర్వహించడం జరిగింది.
 
ఇతర దేశాలనుండి వచ్చిన ప్రయాణికులలో లక్షణాలు కనుగొన్న వ్యక్తులు ఇతరులతో కలవకుండా వారిని నిర్బంధించడం జరిగింది. అంతేకాకుండా దేశ రాజధాని డిల్లీలో జరిగిన మతప్రార్ధనలలో పాల్గొన్న వ్యక్తులను సైతం విజయవంతంగా గుర్తించి వారిని అన్నీ సౌకర్యాలు గల క్వారంటైన్లో పరిశీలనలో ఉంచి నిర్వహించడం జరిగింది.
 
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనల వలన ప్రజలు బయటకు రాలేని పరిస్థితుల దృష్ట్యా రెక్కాడితే డొక్కా డని పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితముగా నిత్యావసర సరుకుల పంపిణీ  ద్వారా ఆదుకొనడం జరిగింది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి నివారణకు గాను రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబములో ఉన్న ప్రతి వ్యక్తికి 3 మాస్కులు చొప్పున కొన్ని కోట్ల మాస్కులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం  ఉచితముగా అందించడం జరిగింది.
 
లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటులే కాకుండా ప్రజలు మాస్కు ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలు అమలు చేసింది. వ్యాధిగ్రస్తులు, లక్షణాలు గల వ్యక్తులను గుర్తించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం నూతనముగా ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థలో ఉన్న వార్డువాలంటీర్ మరియు స్థానిక వైద్య కార్యకర్త లేదా ఏఎన్ఏం ప్రతి ఇంటిని దర్శించుట ద్వారా రాష్ట్రం లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సమాచారం సేకరించబడడం జరిగింది. 
 
ఈ సమాచార సేకరణ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ గృహాలను రెండుసార్లు దర్శించి నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ద్వారా విదేశీ ప్రయాణ చరిత్ర గల వారిని, రోగలక్షణ గల వ్యక్తులను గుర్తించడం మరియు వారి యొక్క కాంటాక్ట్స్‌ని నిర్వహించడం సులువు అయింది. ఎప్పటికప్పుడు టెస్టుల నిర్వహణ,అనుమానితులను క్వారంటైన్లో ఉంచే సౌకర్యాల కల్పన మరియు చికిత్స అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం జరిగింది.
 
వైద్యపరమైన సౌకర్యాలలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలవడం  జరిగింది. ప్రతి ఒక్క జిల్లాకు 5000 పడకల సామర్ధ్యం కలిగిన కోవిడ్ సంరక్షణ కేంద్రాలు, కోవిడ్ కేంద్రాలు, కోవిడ్ ఆసుపత్రులు నెలకొల్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు 2000 పడకలు మించకుండా వివిధ హోటళ్లు అతిథి గృహాలలో సౌకర్యాలు సైతం  ఏర్పాటు చేయబడ్డాయి. 
 
పరీక్షల నిర్వహణకు గాను విస్తృతంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. వివిధ ఆరోగ్య కేంద్రాలు, కోవిడ్ ఆసుపత్రులు వద్దనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్ష కేంద్రాలను సైతం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రజల వద్దకే వెళ్ళి శాంపిల్స్ సేకరణకు గాను మొబైల్ టీంలను, మొబైల్ వాహనాలను సైతం ఏర్పాటు చేయడమైనది. ఈ పరీక్షలు అన్నీ ప్రజలకు ఉచితముగా అందించబడ్డాయి.
 
అత్యవసర వైద్య సేవలు మరియు చికిత్సల నిమిత్తం ఎప్పటికప్పుడు అవసరమైన వైద్యులను, నర్సులను ఇతర మెడికల్ సిబ్బందిని అత్యవసరముగా నియమించుకుని కోవిడ్ వ్యక్తులను నిర్వహించడం జరిగినది. దేశంలో అన్‌లాక్ ప్రక్రియలో కేంద్రం రాష్ట్రాలకు కొన్ని వెసులుబాటులు ఇచ్చినప్పటికీ ప్రజల యొక్క ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రం వాటిని ఉపయోగించుకొనలేదు. ఈ కార్యక్రమాలు అన్నీ ఒక సమర్ధవంతమైన ప్రభుత్వం ఆధ్వర్యములో కేంద్రీకృత కేంద్ర కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
 
పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను ఎప్పటికప్పుడు  చైతన్యవంతులను చేస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతినిత్యం అనేక సూచనలు ఇస్తూ ఈ మహమ్మారిని నియంత్రించటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది.