1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (09:53 IST)

డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ గుడ్‌న్యూస్... అక్టోబర్‌లో స్పుత్నిక్-వి

డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దేశీయ తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. రష్యా నుంచి మొదటి విడతలో 31.5లక్షలు, రెండో విడతలో 4.5 లక్షల స్పుత్నిక్ వీ డోసులు భారత్‌కు వచ్చాయి. 
 
వ్యాక్సిన్ల సరఫరా పెంచడం కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో కలిసి కృషి చేస్తున్నాం. దేశంలో వ్యాక్సిన్ తయారీని కోసం మా భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
 
మే నెలలో దేశవ్యాప్తంగా సాఫ్ట్‌పైలట్ కింద వాణిజ్యపరంగా రష్యా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించామని, ప్రస్తుతం దాదాపు 80 నగరలలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నది అని డా.రెడ్డీస్ ల్యాబ్ పేర్కొంది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన హాస్పిటళ్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ నిల్వకు -18 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇప్పటివరకు 300లకు పైగా లోకేషన్లలో కోల్డ్‌చైన్ మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చాం అని పేర్కొంది.