మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (13:11 IST)

అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త

students
అమెరికా వెళ్లాలని భావించే విద్యార్థులకు అగ్రదేశం ఓ శుభవార్త చెప్పింది. వీసా ఇంటర్వ్యూ మినహాయింపును వచ్చే 2023 డిసెంబరు 31వ తేదీ వరకు అమెరికా పొడగించింది. కరనా నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది.

ఇంటర్వ్యూ మినహాయింపులతో వీసా నిరీక్షణ సమయం బాగా తగ్గనుంది. పైగా, అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులతో పాటు వృత్తి నిపుణులకు ఎంతో మేలు చేకూరనుంది. 
 
ఇంటర్వ్యూ మినహాయింపులకు నిర్ధిష్ట వలసేతర అంటూ అమెరికా వర్గీకరించిన వీసా కేటాగిరీల్లో విద్యార్థులు, వృత్తి నిపుణులు, కార్మికులు కూడా ఉన్నారు.

ప్రత్యేక విద్య, సందర్శకులు, ఒక సంస్థ నుంచి మరో దానికి బదిలీ అయ్యేవారికి కూడా లబ్ధిచేకూరనుంది. అలాగే, వీసా ఉండి నాలగేళ్ళలోగా పునరుద్ధరణకు వెళ్లాలని భావించేవారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు వర్తించనుంది.