మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (09:53 IST)

కరోనాకు టీకా తీసుకున్నా నో యూజ్.. గుజరాత్ మంత్రికి పాజిటివ్

ishwarsinh patel
కరోనాకు టీకా తీసుకున్నా ఫలితం లేకపోయింది. గుజరాత్ మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనాను నియంత్రించేందుకు టీకా తీసుకున్నప్పటికీ  కొవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుజరాత్‌కు చెందిన మంత్రి ఈశ్వర్‌సిన్హ్ పటేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి తన ట్విట్టర్ పేజీలో వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
ఇకపోతే.. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 24,492 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది.

అలాగే 20,191 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,14,09,831కు పెరిగింది. మరో 131 మంది మహమ్మారికి బలవగా.. మరణాల సంఖ్య మొత్తం 1,58,856కు చేరింది.