శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (11:21 IST)

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల పరారీ.. బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు..?

గాంధీ ఆస్పత్రిలో మరోసారి కరోనా బాధితులు కలకలం రేపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితులు పరారయ్యారు. పారిపోయిన నలుగురు చర్లపల్లి జైల్లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్న ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి నలుగురు కూడా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. దీంతో పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు స్పెషల్ టీంగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశారు. 
 
తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్‌లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. పారిపోయిన నలుగురు ఖైదీలు సోమసుందర్, పి. నర్సింహ, మొమహ్మద్ అబ్దుల్ అర్బాజ్, జావిద్‌గా సమాచారం. ఈ నలుగురు కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు.