సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:46 IST)

దేశంలో కరోనా వైరస్ కేసుల సంగతేంటి?

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,570 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,42,923 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.96 శాతంగా ఉంది. 
 
ఇక దేశంలో తాజాగా 413 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,43,928 కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 76,57,17,137 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. 
 
ఇక గడిచిన 24 గంటల్లో 64,51,423 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38, 303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,25,60,474 కు చేరింది.