మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (11:01 IST)

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. 95 మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 11,713 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 95 మంది చనిపోయారు. కరోనా సోకిన వారిలో మరో 14,488 మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.19 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా నమోదైంది. 
 
దేశవ్యాప్తంగా.. శుక్రవారం ఒక్కరోజే 7లక్షల 40వేల 794 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్ల సంఖ్య 20.06 కోట్లు దాటింది. మరోవైపు.. దేశీయంగా మరో 4లక్షల 57వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 54.16 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది.