ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (13:20 IST)

ఒకే రోజు 157 కోవిడ్-19 కేసులు.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మృతి

Covid test
భారతదేశంలో ఒకే రోజు 157 కోవిడ్-19 కేసులు నమోదైనాయి. తద్వారా కోవిడ్ కేసుల సంఖ్య 1,496గా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
 
24 గంటల వ్యవధిలో ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్‌లలో రెండు కొత్త మరణాలు నమోదైనాయి. డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. అయితే కొత్త వేరియంట్ జెఎన్.1 ఆవిర్భావం తర్వాత, చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య అది పెరగడం ప్రారంభమైంది.
 
డిసెంబర్ 5 తర్వాత, డిసెంబర్ 31, 2023న అత్యధికంగా 841 కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన గరిష్ట కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న 1,496 కేసుల్లో ఎక్కువ శాతం మంది (సుమారు 92 శాతం) హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు.
 
ప్రస్తుత డేటా ప్రకారం జెఎన్ 1 వేరియంట్ కొత్త కేసులు విపరీతంగా వ్యాపించవు. ఇంకా ఆసుపత్రిలో చేరడం, మరణాల పెరుగుదలకు దారితీయదని వైద్యులు సూచిస్తున్నారు.