మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:12 IST)

దేశంలో కొత్తగా 9216 పాజిటివ్ కేసులు - 391 మంది మృతి

దేశంలో కొత్తగా మరో 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 391 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. వీరిలో 3,40,45,666 మంది ఈ వైరస్‌ను జయించగా, మరో 99,976 మంది ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,70,115 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 391 మంది చనిపోయారు. అలాగే, 8612 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే ఒమిక్రాన్ కేసులు రెండు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదయ్యాయి.