దేశంలో మరో 70 వేలు.. తెలంగాణాలో 1800 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 70,496 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,06,161కి చేరింది.
గత 24 గంటల సమయంలో 964 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,06,490 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 59,06,069 మంది కోలుకున్నారు.
8,93,592 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్న ఒక్కరోజులోనే 11.6 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,878 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,208 కు చేరింది. ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి.