గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (17:56 IST)

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా వుందా?

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనావైరస్ సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఆయన ఈ నెల 5న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
 
తనకు కరోనావైరస్ సోకిందనీ, వైద్యులు ఇంటికి వెళ్లి హోంక్వారెంటైన్లో వుండి చికిత్స చేయించుకోమని చెప్పినప్పటికీ తను ఆసుపత్రిలో వుండి చికిత్స తీసుకుంటానని ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు ఎస్బీబి. మొన్నటివరకూ ఆయన ఆరోగ్యం మామూలుగా వున్నప్పటికీ అకస్మాత్తుగా నిన్న రాత్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నుంచి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వెంటిలేటర్‌పై ఉన్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.