దేశంలో కొత్తగా 41 వేల పాజిటివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 41,831 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 39,258 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,55,824కు చేరింది.
మరణాల విషయానికొస్తే శనివారం 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,24,351 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,20,521 మంది కోలుకున్నారు.
4,10,952 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 47,02,98,596 వ్యాక్సిన్ డోసులు వేశారు.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.36 శాతానికి చేరుకుందని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.30శాతంగా ఉన్నాయని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.42శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతంగా ఉందని వివరించింది.