మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (11:47 IST)

24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు

corona visus
గత 24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. 
 
కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించినట్లు వెల్లడైంది. వీరిలో పది మంది కేరళ వాసులు. తాజా గణాంకాల ప్రకారం, కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదయ్యాయి మరియు మొత్తం 5,31,300 మంది మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతంగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.