సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (14:53 IST)

దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటీ లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ

ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజరంటూ డబ్ల్యూహెచ్ వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెను ముప్పు తప్పదని, మరిన్ని వేవ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 
 
కరోనా కొత్త వేరియంట్ అయిన ఓమైక్రాన్ ఇప్పటి వరకు 14 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. కానీ మనదేశంలో ఒక్క కేసు కూడా లేదన్నారు. ఇంకా ఒమైక్రాన్‌ను నివారించేందుకు ఇంకా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. వేరియంట్‌కు సంబంధించిన జన్యుపరిక్రమాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.