గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (20:00 IST)

#HappyBirthdayModiji : గిఫ్టుగా 2 కోట్ల కరోనా టీకాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 71వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. అలాంటి వారిలో కరోనా వ్యాక్సినేష్ డ్రైవ్ ఒకటి. బీజేపీ శ్రేణులు ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ స్పందించారు. ఫలితంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 2 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలు కరోనా టీకాలు వేయించుకుని, ప్రధాని మోడీకి అరుదైన టీకా బహుమతి ఇచ్చారు. 
 
ప్రధాని మోడీ పుట్టిన రోజున కరోనా టీకా వేయించుకొని కానుక ఇవ్వాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దేశంలో కోవిడ్ టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు తరలివచ్చారు. 
 
దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన లభించింది. శుక్రవారం రెండు కోట్ల వ్యాక్సినేషన్లు జరగడంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 75 కోట్లకు చేరింది. గాంధీ జయంతి (అక్టోబర్ 2) వరకు ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంద కోట్లకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.