శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (11:07 IST)

కరోనా నుంచి కోలుకున్నా... గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు.. జర జాగ్రత్త

కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్స కోసం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ పద్ధతుల్లో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.
 
తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న తర్వాత కూడా.. వారిలో దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు వరుసగా వస్తున్నట్లుగా పరిశోధనల్లో వెల్లడవుతుండడంతో ఆందోళనలో మునిగిపోతున్నారు కరోనా వైరస్ బారిన పడిన బాధితులు.
 
ఇటీవలే ఇలాంటి ఓ ఆసక్తికర విషయం ఈ అధ్యయనంలో వెల్లడైంది. లండన్‌లోని యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 
 
ఆస్ట్రియాలోని పలు ఆసుపత్రిల్లో చికిత్స పొందిన 86 మంది కరోనా రోగులపై అధ్యయనం జరపగా... వారిని డిశ్చార్జ్ చేసిన అనంతరం వారిలో ఊపిరితిత్తుల సమస్యలు, గుండె పనితీరుకు సంబంధించిన సమస్యలు తలెత్తినట్లు అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అందుకే కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నప్పటికీ... ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.