శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (17:15 IST)

తైవాన్ మాత్రం ఆ విషయంలో గ్రేట్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తైవాన్ మాత్రం ఈ విషయంలో మిగతా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత 200 రోజులుగా అక్కడ స్థానికంగా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఫలితంగా ఇన్ని రోజులపాటు కేసు నమోదు కాని ఏకైక దేశంగా రికార్డులకెక్కింది.

తైవాన్‌లో చివరిసారి ఏప్రిల్ 12న కేసు నమోదైంది. 23 మిలియన్ల మంది కలిగిన తైవాన్‌లో ఇప్పటి వరకు 553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఏడుగురు మృత్యువాత పడ్డారు.
 
కరోనాపై పోరులో అందరికంటే ముందే సరిహద్దులు మూసివేయడం, ప్రయాణ ఆంక్షలు విధించడం కారణంగా అక్కడ కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ప్రజలందరూ మాస్కులు ధరించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి కూడా వైరస్‌కు అడ్డుకట్ట వేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను అడ్డుకున్న ఏకైక దేశం తైవానేనని వైద్యులు చెప్తున్నారు.