శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: గురువారం, 6 మే 2021 (20:30 IST)

కొవిడ్‌ బాధితుల కోసం గత జులైలో జారీ చేసిన మార్గదర్శకాల్లో పలు మార్పులు

దిల్లీ: కొవిడ్‌ బాధితుల కోసం గత జులైలో జారీ చేసిన మార్గదర్శకాల్లో పలు మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని కేంద్రం సూచించింది.

బీపీ, షుగర్‌ ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలి. కరోనా బాధితులు మూడు పొరల మాస్క్‌ ధరించాలి. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలి. ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.

ఐసోలేషన్‌ నుంచి పది రోజుల తర్వాత బయటికి రావొచ్చు. చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.