సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (08:44 IST)

సౌతాఫ్రికా నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కూడా ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
థానే జిల్లాలని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీ నుంచి సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ నుంచి ముంబైకు చేరుకున్నాడు. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వీటిని పరిశీలించగా, అతనికి ఒమిక్రాన్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, ఆదివారం సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో తేలింది.