సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (11:52 IST)

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 3వేలకు చేరువగా కేసులు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతోంది. నిత్యం మూడు వేలకు చేరువగా కరోనా కేసులు నమోదు అవుతున్న తీరు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2751 కాగా, గడచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 808 కి చేరింది. 
 
ఇక తాజాగా 1675 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 89,350 మంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 30,008గా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.