శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (15:22 IST)

ఆ మహిళ నాలుగు డోసుల కోవిడ్ టీకా తీసుకున్నా.... కరోనా పాజిటివ్

టీకా వేసుకున్నాం కదా... కరోనావైరస్ ఏం చేస్తుందిలే అనుకోవడం పొరబాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టీకా తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్, కోవిడ్ వైరస్ పట్టుకుంటున్న కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కరోనా వేరియంట్ టీకా తీసుకున్నవారిలోనూ కనబడుతోంది.

 
ఇక అసలు విషయానికి వస్తే... నాలుగుసార్లు కోవిడ్ టీకా వేసుకున్న మహిళ దుబాయ్ నుంచి ఇండోర్ వచ్చింది. తిరుగు ప్రయాణం చేసేందుకు ఇండోర్ విమానాశ్రయానికి రాగా అక్కడ ఆమెకి కరోనా పాజిటివ్ నిర్థారణ పరీక్షలు చేయగా ఆమెకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీనితో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
 
 
ఈ మహిళ గత వారం రోజుల క్రితమే ఓ శుభకార్యానికి హాజరైనట్లు అధికారులు ధృవీకరించారు. దాంతో ఆమెతో సన్నిహితంగా వున్నవారితో పాటు శుభకార్యంలో పాల్గొన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకూ 10 వేల మందికి పైగా మరణించారు.