శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (11:41 IST)

దేశంలో కరోనా వైరస్ ఉధృతి - 96 యాక్టివ్ కేసులు

covid test kit
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన గంటల్లో దేశ వ్యాప్తంగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 9,486 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 90,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
తాజాగా కేసులతో కలిసి ఇప్పటికివరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,18,839కి పెరిగింది. వీరిలో 4,27,97,092 ఉంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,047 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా, క్రియాశీల రేటు 0.22 శాతం, మరణాల రేటు 1.21 శాతంవుంది. ఇప్పటివరకు 1,97,31,43,196 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.